ఆగమనం [Aagamanam]
(By Yaddanapudi Sulochana Rani) Read EbookSize | 22 MB (22,081 KB) |
---|---|
Format | |
Downloaded | 598 times |
Last checked | 9 Hour ago! |
Author | Yaddanapudi Sulochana Rani |
లోపల ప్రసన్న కుర్చీని కట్టేసి వున్నాడు. చేతులు - పెడరెక్కలు విరిచి కట్టేసి వున్నాయి. నోటికి గుడ్డ బిగించి వుంది. ఆ మూలుగు వస్తున్నది అతని దగ్గి నుంచే అతడు కట్లు విదిపిమ్చ్కోవటానికి పెనుగులాడుతున్నాడు...
జమున గబ గబా గది తలుపులు తెరిచింది.
ప్రసన్నా ! ప్రసన్నా ! అంటూ పరుగెత్తుకెళ్ళి అతడి చేతులకి కట్టిన కట్లు విప్పింది. అతని నోటికి కట్టేసిన బట్ట లాగేసింది.
నేను రాకపోతే ఎంత ప్రమాదం జరిఎది ? ఆ పని కుర్రాడు, ఆ రాస్కెల్ - ఆవేశంగా అంటోంది.
కట్లు ఊడిపోగానే ప్రసన్న కుర్చీలో నుంచి లేచాడు. అతని శరీరం నిటారుగా అయింది.జమునని చూడగానే అతడు పళ్ళు బిగించాడు. అతని చేతులు వచ్చి జమున భుజాల్ని గట్టిగా పట్టుకున్నాయి....
ప్రసన్న గతం అతణ్ణి వెన్నాడింది. ఇష్టపడి చేసుకున్న శోభ తన అనైతిక ప్రవర్తనతో ప్రసన్నకు మనశాంతి లేకుండా చేసింది. అయితే జమున అతడికి చేరువ అవుతుంది. ఆమె అందరిలాంటిది కాదు ఆమె వ్యక్తిత్వం ప్రసన్నను ఆకర్షిం చింది .
కొందరి ఆగమనం ఆనంద శిఖరాలకి చేరిస్తే, మరికొందరి ఆగమనం పతనపు లోయలలోకి తోసేస్తుంది. జమున ఆగమనం ప్రసన్న జీవితాన్ని ఏ మలుపు తిప్పింది? యద్దనపూడి సులోచనా రాణి అధ్బుత పరిశీలనాత్మక నవల.”