“Book Descriptions: దట్టంగా పెరుకున్న ఎండుటాకుల క్రింద నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎవరో నిద్రలేచి బద్ధకంగా నిట్టూర్చిన వేళ! ఆనంద నృత్య హేల చీకటి ప్రపంచపు గణాధిపతుల కాస్మోరా అంశంతో ప్రపంచాన్ని ఏలటానికి వస్తున్నాడు ’అష్టావక్ర’. అతడి ఆగమనానికి సూచన! అప్పుడే ఏడుగురు వికృత శిశువులు జన్మించారు.
దేశం దృష్టి యావత్తు ఆ గ్రామం మీద పడింది. ఏనిమిదోవాడు కేదారగౌర గర్భాన ప్రవేశించాడు. అతని పుట్టుకని ఎవరాపగలరు? మెజీషియన్ షాడో...డాక్టర్ రంగప్రసాద్. స్వామి శివనంద.
కొన్ని వేల సంవత్సరాల క్రితం శిశువు జన్మించగానే శరీరం అంతా ఉప్పు జల్లి బ్యాడేంజితో కట్టేసేవారట. ఇంత అనాగరికమైన స్థితి నుంచి మనిషి ఎదిగాడు. మ్యుటేషన్స్ రహస్యాన్ని శోధించారు. క్లోనింగ్ ప్రయోగాల్లో విజయం సాధించాడు. కానీ ఇదంతా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? సామాన్యులు కలలో కూడా ఊహించని చోటుకి రచయిత మిమ్మల్ని తీసుకువెళ్తాడ జెనిటిక్స్ శాస్త్ర పరిజ్ఞానం పెంచుకోవడం కోసం ఈ నవల. మనిషి ’పుట్టుక’ లో వస్తున్న పరిణామల భూత, భవిష్యత్, వర్తమానాల సైన్సు- సస్పెన్సుల మరో కలయిక ఈ నవల.” DRIVE