“Book Descriptions: "అప్పుడే ఏమయిందిరా పరదేశీ! నీ ప్రాణాలు తీయకుండా నేను నిద్రపోతానని అనుకోకు. నిన్ను చంపే బుల్లెట్‌ని వెండితో తయారు చేయిస్తాను. దాని నిండా నేనే స్వయంగా మందును కూరి సిద్ధం చేస్తాను....” అంటూ ఎడారి అంచు వైపు అడుగులు వేయటం ప్రారంభించాడు.
వంద అడుగులు కూడా వేయకముందే వెనకనుంచి వినవచ్చింది చిన్నగా దగ్గిన సద్దు.
అదిరిపడి వెనక్కు చూశాడు మొజాంబో. నవ్వుతూ కనిపించిన షాడోని గమనించి మ్రాన్పడిపోయాడు . బెల్టు వెనుక వున్న రివాల్వర్‌ని తీసి అతని ముందు పడేసేటట్లు విసిరాడు షాడో.
"మొజాంబో! అందుకో ఆ రివాల్వర్‌ని. ఆఖరి అవకాశం ఇది ” అన్నాడు పిడికిళ్ళు బిగించి రెడీగా నిలబడుతూ. చేతిలోని సంచీని క్రిందికి వదిలి ఉన్నట్లుండి ముందుకు దూకాడు మొజాంబో.
షాడో వట్టి చేతులతో నిలబడి వుండటం అతనికి విపరీతమైన ధైర్యాన్నిచ్చింది. అనవసరంగా వెండి బుల్లెట్‌ని చేయించటం దేనికి? మామూలు బుల్లెట్‌తోనే అయిపోతుంది అతని పని.” DRIVE