మీనా - 2 [Meena - 2]
(By Yaddanapudi Sulochana Rani) Read EbookSize | 28 MB (28,087 KB) |
---|---|
Format | |
Downloaded | 682 times |
Last checked | 15 Hour ago! |
Author | Yaddanapudi Sulochana Rani |
వాటికి తలుపులు, తాళాలు ఉండవు. క్రమశిక్షణ పేరిట అంతస్తు అలవాట్ల పేరిట మీనాని అలాంటి మానసిక జైలులోనే పెంచింది కృష్ణవేణమ్మగారు.
కొన్ని పట్టుదలలు ఉంటాయి ...
జీవితంలో జరిగినవన్నీ గుర్తుండవు. గుర్తుండే బలమైన సంఘటనలైనా జ్ఞాపకాలలో అప్పుడప్పుడు కదులుతాయి. కానీ పసితనంలో కృష్ణకి మేనత్త కృష్ణవేణమ్మ వల్ల జరిగిన అవమానం అహర్నిశలూ గుర్తొస్తూ రక్తాన్ని మరిగించే పట్టుదలగా మారింది. కానీ మేనత్త కూతురు మీనాని చూసాక మనసులో ఏదో తియ్యటి సంచలనం తలెత్తింది.
కొన్ని మనస్తత్వాలు ఉంటాయి ...
ఇంకో పిల్లపుడితే వున్న ఒక్క కూతురు మీనా మీద ప్రేమ తరిగి పోతుందేమో తన తల్లి భాగాలుగా మలచాల్సి వస్తుందేమోనన్న వెర్రి ప్రేమ కృష్ణవేణమ్మది. తన మనస్సు కూతురు మనసు ఒకటేనని, తనకి నచ్చిన భవిష్యత్తునే కూతురుకి అందించాలని, మీనాకి నచ్చని సారధిని అల్లుడిగా ఎంచుకున్న విచిత్రమైన మనిషి కృష్ణవేణమ్మ.
వీరందరి పట్టుదల, పంతాలు, ఆశనిరాశలు, కోపతాపాల సజీవ సమ్మేళనమే మీనా.
తెలుగు తెరకి, తెలుగు పాఠకులకి సుపరిచితమే. చక్కటి పరిమళం ఎన్నిసార్లు ఆస్వాదించినా యిలాంటి చక్కటి నవల ఎన్ని సార్లు చదివినా అందేవి ఆనందం, తృప్తి.”