“Book Descriptions: లండనులోని "ట్రెఫాల్గర్ స్క్వేర్" వద్ద గుర్రపు తల, మనిషి శరీరంతో వింతజంతువు కనిపిస్తుంది. చేతికి కడియం, ఒంటికి దుస్తులు, ఎనిమిదడుగుల ఎత్తు ఉన్న ఆ విచిత్ర జీవి స్పృహలో ఉండదు. జంతు ప్రదర్శనశాలలో ఉంచిన ఆ వింతజంతువును చూసేందుకు తీర్థప్రజల్లా జనం తండోపతండాలుగా వస్తారు. మేలుకున్నాకా ఆ జంతువు మాట్లాడుతూండడం, నవ్వుతూండడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ జంతువు చివరకు ఓ పోలీస్ వద్ద తుపాకీ లాక్కోవడంతో భయమూ పొందుతారు. చివరకు ఆ జంతువు జంతువు కాదు, అది మాట్లాడుతున్న భాష సంస్కృతం అని తేలుతుంది.” DRIVE