“Book Descriptions: "పాతనంతా తిరస్కరించడమే అభివృద్ధి అనుకుంటారు కొందరు" అనేది, నూతనమైన ఆలోచనలమీద ఒక విమర్శ! కానీ, ఇది 'పాత' కాదు. 'పాత' అయిపోలేదు. 'రామాయణం' ప్రచారం చేసే విలువలూ, సంస్కృతీ ఈ నాటికీ నిత్య జీవితాల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ఈ నాటి సాంఘిక సమస్యలకు 'రామనామ జపాన్ని' పరిష్కారంగా చెప్పే ఏ ఒక్క సంఘటన అయినా చాలు - ఆ గ్రంథం 'పాతదైపోలేదని' నిర్ణయించడానికి!
ఈ ప్రయత్నానికి అర్థం - పాతనంతా తిరస్కరించడం కాదు. 'పాత' అంతా మానవ చరిత్రే. ఆ 'చరిత్ర పరిణామం'లో, రామాయణ పుట్టుపూర్వోత్తరాల్నీ, దాన్ని నిత్యం ప్రచారం చేసే వ్యవస్థ నిజ స్వరూపాన్నీ, వీటిని స్పష్టం చేయడమే ఈ పుస్తకం లక్ష్యం.” DRIVE