“Book Descriptions: సాంప్రదాయాలంటే పడి చచ్చే కుటుంబాల్లో పిల్లలకు, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోడం పెద్ద సమస్యే. ఈ నవలలోని ఇతివృత్తం ఇదే.
కుల మత భేదాలని లక్ష్యపెట్టకుండా నిలబడడం అంటే, పెద్ద వాళ్ళ దయా ధర్మాల కోసమూ, వాళ్ళ అనుమతుల కోసమూ, ఎదురుచూడడం కాదు.
కథావస్తువులో 'అభివృద్ధి నిరోధకమైన' అంశాలేమీ లేవు. ప్రధాన పాత్రలు 'ఆదర్శవంతంగానే' ఉన్నాయి. పద్మజ అభ్యుదయ భావాలతో ప్రవర్తించింది. పార్వతి కూడా కథ పొడుగునా సంస్కారం తోటీ, ఆత్మగౌరవం తోటీ ప్రవర్తించింది.” DRIVE