నృకేసరి (కథనప్రస్థం)
(By కవనమాలి (kavanamaali)) Read EbookSize | 23 MB (23,082 KB) |
---|---|
Format | |
Downloaded | 612 times |
Last checked | 10 Hour ago! |
Author | కవనమాలి (kavanamaali) |
నేను మీ కవనమాలి. నేను ఎప్పుడూ పాఠకుడిని, అప్పుడప్పుడు రచయితని. ఇప్పుడు నేను నా మొదటి నవలతో మళ్ళీ మిమ్మల్ని పలకరించబోతున్నాను. ఆ నవలే నృకేసరి - కథనప్రస్థం. ఈ నవల గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. చిన్నప్పుడు ఈటీవీలో వచ్చిన భాగవతం సీరియల్ నాలో ఊహించడం అనే క్వాలిటీని ఎన్నో రెట్లు పెంచింది. అందులో శుకమహర్షి భాగవతం చెప్పిన విధానంపై ఉన్న ఇష్టం, ఆ కథలు నాలో కలిగించిన ఆసక్తి కలగలిపి ఓ చిన్న కథ అల్లాను. అలాగని ఇదేమీ పూర్తిగా ఆధ్యాత్మిక గ్రంథం కాదు, ఇందులో నేనెలాంటి సమస్యల గురించి చర్చించలేదు. కేవలం కథ చెప్పాను. కథ తొంభై శాతం ప్రస్తుతంలో అంటే 2024 లోనే జరుగుతుంది. ఇందులో మైథాలజీ ఉంది, లవ్ ఉంది. డ్రామా ఉంది. యాక్షన్ ఉంది. నాదొక్కటే మనవి. దయచేసి ఈ కథాంశంలోని విషయాలను మీ స్వంత వాదాల చర్చల్లోకి లాగి నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరూ ఇబ్బంది పడకండి. అన్నీ మరచిపోయి హాయిగా ఓ సినిమా చూస్తున్నట్టు ఈ పుస్తకాన్ని అలా అలా చదివేసేయండి.
ఇట్లు మీ కవనమాలి.”